Saturday, 4 March 2017

5 మార్చి 2017

కాంట్రాక్టర్లకు నూతన పనులు చేపట్టే విషయంలో పునరాలోచన అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. వీసా, పాస్‌పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. పెద్దలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.

Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. వాహన చోదకులకు నోటీసులు, జరిమానా, చెల్లింపులు లాంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి అధికం.

Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ధన సహాయం, చెల్లింపులలో అప్రమత్తత అవసరం. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రతి విషయం మీ కుటుంబీకులకు తెలియజేయటం మంచిదని గమనించండి. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పెండింగ్ పనులు సైతం పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సకాలంలో పూర్తవుతాయి. మీ అంచనాలకు తగినట్లుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

మొక్కుబడులు తీర్చుకుంటారు. నూతన వ్యాపారాలు చేపట్టే ఆలోచనలు మరికొంతకాలం వాయిదా వేయటం మంచిది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మీ విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం.

Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఉన్నతాధికారులపై దాడులు జరిగే ఆస్కారం ఉంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బహుమతులు అందిస్తారు.

Friday, 17 February 2017

18 ఫిబ్రవరి 2017

ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించటం మంచిది. నిరుద్యోగులకు మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం. రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఎదుర్కొంటారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీయవచ్చు.

Thursday, 16 February 2017

17 ఫిబ్రవరి 2017

కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. క్రయవిక్రయాలు సామాన్యం. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచటం శ్రేయస్కరం. వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Wednesday, 15 February 2017

16 ఫిబ్రవరి 2017

స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించటం మంచిది. ముఖ్యుల నుంచి వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఒత్తిడి వల్ల మానసికాందోళన తప్పదు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు విశ్రాంతి లభిస్తుంది.

Tuesday, 14 February 2017

15 ఫిబ్రవరి 2017

అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. చేతివృత్తుల వారికి అన్ని విధాలా కలసిరాగలదు. పాత మిత్రుల కలయికతో మీలో మార్పు వస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు అధికం కావడంతో శ్రమ తప్పదు.

Monday, 13 February 2017

14 ఫిబ్రవరి 2017

బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. వాహన ఛోదకులకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణాలు.


Sunday, 12 February 2017

13 ఫిబ్రవరి 2017

ఆదాయం బాగున్నా ఆర్థిక పరిస్థితి ఏమంత సంతృప్తికరంగా ఉండదు. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత అవసరం. కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు, చికాకులు అధికమవుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. శుభవార్తా శ్రవణం.

Saturday, 11 February 2017

12 ఫిబ్రవరి 2017

భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెలకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. స్థిర చరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి.

Friday, 10 February 2017

11 ఫిబ్రవరి 2017

మెడికల్, ఎరువులు, ఫ్యాన్సీ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా పురోగమిస్తారు. ఆస్తి వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది.

Thursday, 9 February 2017

10 ఫిబ్రవరి 2017

లీజు, ఏజెన్సీ, ఉమ్మడి వ్యాపారస్తులకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ అవసరం. ముఖ్య విషయాల్లో మిత్రులు తమ సహాయ సహకారాలను అందిస్తారు. బ్రోకర్లకు, ఏజెంట్లకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలు దూర ప్రయాణాలు, షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ప్రైవేటు సంస్థల్లోనివారు అధిక కృషి చేసి అధికారుల మెప్పు పొందుతారు.

Wednesday, 8 February 2017

9 ఫిబ్రవరి 2017

మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు కలిసి రాగలదు. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో మెలకువ వహించండి. క్రీడా, కళా రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవటం మంచిది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.

Tuesday, 7 February 2017

8 ఫిబ్రవరి 2017

ఆస్తి వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులపట్ల చికాకులు తప్పవు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం ఉంటుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితో మెలగటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు.

Monday, 6 February 2017

7 ఫిబ్రవరి 2017

రాజకీయాలలోని వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. సహకార సంఘాలలోని వారికి, క్లబ్బులలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఆహార వ్యవహారాలలో మెలకువ వహించండి. ఎండుమిర్చి, ధనియాల స్టాకిస్టులకు లాభం చేకూరగలదు. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. వాహనం నడుపునపుడు మెలకువ అవసరం.

Sunday, 5 February 2017

6 ఫిబ్రవరి 2017

మీ పెద్దల వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లోని వారికి అచ్చుతప్పులు దొర్లటంవల్ల పై అధికారులతో మాటపడక తప్పదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోని వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు.

Saturday, 4 February 2017

5 ఫిబ్రవరి 2017

ఉద్యోగస్తులు, అపరిచిత వ్యక్తులతో మెలకువ అవసరం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. దూర ప్రయాణాలలో మెలకువ వహించండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. క్రయ, విక్రయ రంగాల వారికి పురోభివృద్ధి.

Friday, 3 February 2017

4 ఫిబ్రవరి 2017

ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ సమస్యలకు పరిష్కార మార్గం కానవస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమైనా సంతృప్తి కానవస్తుంది. నూతన వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

Thursday, 2 February 2017

3 ఫిబ్రవరి 2017

వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందులు, ఆల్కహాల్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. విద్యార్థినులకు భయాందోళనలు అధికమవుతాయి. ఆర్థిక స్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది.

Wednesday, 1 February 2017

2 ఫిబ్రవరి 2017

కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ పై మిత్రుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఖర్చులు రాబడికి మించటంతో స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Tuesday, 31 January 2017

1 ఫిబ్రవరి 2017

బ్యాంకు లావాదేవీలయందు అనుకూలతలుంటాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికం అవుతాయి. రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం.

Monday, 30 January 2017

31 జనవరి 2017

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కొన్ని విషయాలలో మీ ఊహలు, అంచనాలు నిజం అవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

30 జనవరి 2017

గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం పెచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. దైవ కార్యాలపట్ల ఆసక్తి పెంచుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు.

Saturday, 28 January 2017

29 జనవరి 2017

నిత్యావసర వస్తు ధరలు అధికం అవుతాయి. సొంత వ్యాపారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చికాకులు ఎదుర్కొంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం అవుతాయి. చేతి వృత్తుల వారికి సంతృప్తి.

Friday, 27 January 2017

28 జనవరి 2017

సన్నిహితులతో కలిసి దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెలకువ అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ప్రముఖులను కలిసి సంప్రదిస్తారు.

Thursday, 26 January 2017

స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. విద్యార్థులు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. వాహన ఛోదకులకు అప్రమత్తత అవసరం.

Wednesday, 25 January 2017

26 జనవరి 2017

హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. నిర్మాణ పనులు, మరమ్మత్తులలో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనుకున్న పనులు ఒకపట్టాన పూర్తికావు. బంధువుల నుంచి కొత్త విషయాలను గ్రహిస్తారు. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది.

Tuesday, 24 January 2017

25 జనవరి 2017

ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు, చర్చలు జరపుతారు. నిరుద్యోగులకు ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. వాహన ఛోదకులకు జాగ్రత్త అవసరం.

24/01/2017

మీ ఆశయాలు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటా, బయటా సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. ఆహార విషయంలో వేళ తప్పి భుజించటంవల్ల ఆరోగ్య భంగం కలుగుతుంది.